విభిన్నమైన కథతో పాటు ఆసక్తికరంగా సాగే టేకింగ్‌ను చూసి ఖుషీ అయిన శర్వానంద్ ఏకంగా 4కోట్లను వెచ్చించి ‘కేశవ’ హక్కులను సొంతం చేసుకున్నాడు. నిఖిల్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అందరికి ఆసక్తిగా ఉంది. ఇప్పటికే విభిన్న కంటెంట్‌తో ఆకట్టుకున్న దర్శకుడు సుధీర్ వర్మ టేకింగ్‌పై అందరికి అంచనాలు ఉన్నాయి. తాజాగా ట్రైలర్ చూడగానే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అందుకే శర్వా కూడా నమ్మకం పెట్టుకుని ‘కేశవ’పై కోట్లు పెట్టాడు. అయితే శర్వా ఈ ప్రయత్నం ఫలిస్తుందా ఏమో చూడాలి.