యువ హీరో శర్వానంద్ సంక్రాంతికి ‘శతమానంభవతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సంక్రాంతికి చిరంజీవి ‘ఖైదీ నెం.150’ మరియు బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా శతమానంభవతి చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ను శర్వానంద్ అందుకున్నాడు. పండుగ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరో పండుగకు ‘రాధా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. అయితే ఈసారి మరింత ఎక్కువ సాహసం చేయబోతున్నాడు. నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడు.
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘రాధా’ చిత్రం ఈ నెల చివర్లో ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే సమయంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా విడుదల కాబోతుంది. నాలుగు నెలల క్రితమే ఉగాదికి కాటమరాయుడును విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి పవన్ కళ్యాణ్‌కు పోటీగా శర్వానంద్ పోటీకి దిగడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.
సంక్రాంతి పరిస్థితి వేరు, ప్రస్తుత పరిస్థితి వేరు. అలాగే శతమానంభవతి సినిమా వేరు రాధా సినిమా వేరు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్‌తో పోటీ పడటం అంటే నిప్పుతో చెలగాటం ఆడటమే అని, కాస్త ఫలితం అటు ఇటు అయితే సినిమా పబ్లిసిటీ ఖర్చు కూడా రాదని సినీ వర్గాల వారు మరియు పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. కనీసం రెండు వారాల గ్యాప్‌లో పవన్ తర్వాత శర్వా వస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.