ఇద్దరు భామల ముద్దులతో ‘రాధ’ పండగ చేసుకుంటున్నాడుగా!!

తనకు సరిపోయే కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్‌ ‘శతమానం భవతి’ చిత్రంతో కెరియర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం తర్వాత మరో మూడు ప్రాజెక్ట్‌లను లైనులో పెట్టాడు. శర్వానంద్‌ ప్రస్తుతం కొత్త దర్శకుడు శర్వానంద్‌ దర్శకత్వంలో ‘రాధ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందకు రానుంది. మరో 10 రోజుల్లో విడుదల కాబోతుండడంతో చిత్ర యూనిట్‌ తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్‌ శర్వానంద్‌ పెళ్లి పట్టు వస్త్రాలను ధరించి కాస్త రఫ్‌గా కనిపించాడు. ఇరు వైపులా ముద్దుగుమ్మలు లావణ్య త్రిపాఠి మరియు అక్షలు పట్ట చీరల్లో పదహారణాల తెలుగింటి అమ్మాయిల్లా ముస్తాబు అయ్యి శర్వాకు ముద్దులు పెడుతున్నారు. ఇద్దరు భామలతో ముద్దులు పెట్టించుకుంటూ శర్వానంద్‌ మద్యలో నిలబడి హాయిగా నవ్వుతున్నాడు. ఇక శర్వా అభిమానులు ఇద్దరు భామలతో ముద్దులు పెట్టించుకుంటూ ‘రాధ’ పండుగ చేసుకుంటున్నాడుగా అని ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.