నటీనటులు : మహేష్ బాబు , కీర్తి సురేష్ , సముద్ర ఖని తదితరులు
డైరెక్టర్ : పరుశురాం
మ్యూజిక్ డైరెక్టర్ : థమన్
నిర్మాత : మైత్రి మూవీ మేకర్స్
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
విడుదల తేదీ : మే 12 , 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది..? కథ ఏంటి..? మహేష్ – కీర్తిలా జోడి ఎలా ఉంది..? సినిమా ప్లస్ – మైనస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
కథ :
అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్ (మహేశ్‌బాబు). ఈ తరుణంలో అమెరికాలో చదువు కోసమని వెళ్లిన కళావతి (కీర్తిసురేష్) మహేష్ దగ్గర అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్ కు తెలిసిపోతుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని) దగ్గరికి బయల్దేరతాడు. ఆలా వైజాగ్ కు వెళ్లిన మహేష్ తన డబ్బును రాబట్టుకున్నాడా..లేదా..? అసలు మహేష్ కు కళావతి గురించి తెలిసిన నిజాలు ఏంటి..? తదితర విషయాలు తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
ప్లస్ :
* ఫస్ట్ హాఫ్
* మహేష్ – కీర్తి లవ్ ట్రాక్
* సంగీతం – ఫైట్స్
మైనస్ :
* సెకండ్ హాఫ్
* కథ – కథనం
నటీనటుల తీరు :
మహేష్ బాబు మరోసారి తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. కామెడీ , డాన్స్ , యాక్షన్ ఇలా అన్నింట్లోనూ ఆకట్టుకున్నాడు. కీర్తి సురేష్ గ్లామర్ తోనే కాకుండా నటనతో ఆకట్టుకుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో అమ్మడికి పెద్దగా స్కోప్ లేకుండా అయిపొయింది. విలన్ గా సముద్రఖని పర్వాలేదు అనిపించాడు.
వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, తనికెళ్ల భరణి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం :
థమన్ మరోసారి తన మ్యూజిక్ తో కట్టిపడేసాడు. కళావతి , మా..మా మహేశా సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మది కెమెరా వర్క్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఇక డైరెక్టర్ విషయానికి వస్తే..బ్యాంకు రుణాలు, చెల్లింపుల విషయంలో మధ్య తరగతివాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి..? ఆ వ్యవస్థపై పెద్దోళ్ల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథతో చెప్పే ప్రయత్నం చేశారు పరుశురాం. కానీ అది తెరపై కరెక్ట్ గా చూపించలేకపోయారు. ఫస్ట్ హాఫ్ కామెడీ , సాంగ్స్ , మహేష్ – కీర్తి ల లవ్ ట్రాక్ తో పర్వాలేదు అనిపించాడు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చేతులెత్తేశాడు. లాజిక్ లేని సన్నివేశాలతో నడిపించాడు.
ఓవరాల్ గా : అంచనాలను అందుకోవడం లో సర్కార్ విఫలమయ్యాడు.