Site icon TeluguMirchi.com

సరిలేరు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కావాలా..?

మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ చిత్రం సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫై అభిమానుల్లో ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ అప్డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపారు. సరిలేరు మూవీ కాంటెస్ట్ ఒకటి ప్రకటించారు. మూవీ కాంటెస్ట్ లో జాయిన్ అవుతే జనవరి 05 న జరిగే ప్రీ రిలీజ్ పాస్ , ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దక్కించుకునే అవకాశం కలదని తెలిపారు. ఇంకెందుకు ఇప్పుడే ఈ కాంటెస్ట్ లో జాయిన్ అయి..టికెట్ , పాస్ లు దక్కించుకోండి.

Exit mobile version