Sarangapani Jathakam : ‘సారంగపాణి జాతకం’ గ్రాండ్ సక్సెస్.. టీమ్ హ్యాట్రిక్ హిట్ సెలబ్రేషన్స్ !


Sarangapani Jathakam : సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ హీరో ప్రియదర్శి నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత స్పందనను అందుకుంది. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో రూపా కొడవయూర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.

సక్సెస్ ఈవెంట్‌లో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ, “ప్రియదర్శి వెర్సటైల్ హీరో అని నేను ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు ఆడియెన్స్‌ కూడా అంగీకరిస్తున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ గారితో ఇది నా మూడో సినిమా. హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఆనందంగా ఉంది. ప్రేక్షకుల ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను” అన్నారు. హీరో ప్రియదర్శి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “సారంగపాణి జాతకం టీం గెలిచింది అంటే నేనూ గెలిచాను. బుక్ మై షోలో ట్రెండ్ అవుతున్నాం, రివ్యూలు అద్భుతంగా వచ్చాయి. మా సినిమాను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. సినిమా గెలిచింది.. మేం గెలిచాం” అంటూ హర్షం వ్యక్తం చేశాడు.

Also Read :  CM Pellam : ప్రజాసేవపై ప్రశ్నలు వేసే సినిమా – మే 9న థియేటర్లలో

Also Read : Shraddha Srinath : శ్రద్దా శ్రీనాథ్ ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ రిలీజ్..

నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, “చిత్రం వాయిదాలు పడుతుందని అనుకున్నారు, కానీ ఇప్పుడు సరైన టైంకి వచ్చిందని అంతా మెచ్చుకుంటున్నారు. మౌత్ టాక్‌తో ఇంకా ముందుకు వెళ్తుంది,” అన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ, “చాలా కాలం తరువాత థియేటర్‌లో ప్రేక్షకుల నవ్వులతో హాల్ దద్దరిల్లింది. ఇది మంచి సినిమా విజయానికి నిదర్శనం. ఇంద్రగంటి గారికి, కృష్ణ ప్రసాద్ గారికి ధన్యవాదాలు” అని తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సక్సెస్ మీట్‌లో హీరోయిన్ రూపా కొడవయూర్, అవసరాల శ్రీనివాస్, కెమెరామెన్ పీజీ విందా, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read :  HHVM Trailer : గూస్ బంప్స్ ఎలివేషన్స్ తో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ కట్ ?

Also Read : Sree Vishnu : శ్రీ విష్ణు ‘సింగిల్’ రిలీజ్ డేట్ లాక్ !!