Site icon TeluguMirchi.com

సారంగపాణి జాతకం తెలిసేది ఆరోజే !


Sarangapani Jathakam : హీరో ప్రియదర్శి, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కాంబినేషన్‌లో రూపొందిన వినోదాత్మక చిత్రం ‘సారంగపాణి జాతకం’ ఈ నెల 25న సమ్మర్ స్పెషల్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఇంటిల్లిపాదినీ నవ్వించే హాస్యంతో పాటు, యువతను ఆకట్టుకునే క్రైమ్ కామెడీ అంశాలు ఈ చిత్రంలో కీలకంగా ఉండనున్నాయి. ప్రియదర్శి – రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, సినిమాటోగ్రఫీ: పీజీ విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ అందించారు.

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ – “శ్రీదేవి మూవీస్ బ్యానర్ పేరు నిలబెట్టే సినిమా ఇది. కంప్లీట్ ఎంటర్‌టైనర్ తీయాలన్న నా కోరిక ఈ సినిమాతో నెరవేరింది. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది, సెన్సార్ కూడా పూర్తయ్యింది. అసలు 18న రిలీజ్ చేయాలనుకున్నా, మంచి థియేటర్ల అందుబాటులో ఉండేందుకు బయ్యర్ల సూచన మేరకు 25న విడుదల చేస్తున్నాం. ‘బలగం’, ‘35’, ‘కోర్టు’ వంటి సినిమాల తర్వాత ప్రియదర్శి క్రేజ్ పెరిగింది. ఈ సినిమాతో ప్రేక్షకులను పక్కాగా ఎంటర్‌టైన్ చేస్తారు. ఇంద్రగంటి గారి ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’లాగే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది” అన్నారు.

Exit mobile version