Site icon TeluguMirchi.com

క‌న్నీళ్లు పెట్టుకొన్న మున్నాభాయ్‌

sanjaydutజైలు శిక్ష ప‌డిన త‌ర‌వాత తొలిసారి సంజ‌య్‌ద‌త్‌.. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అటు సినిమా షూటింగుల‌కు, ఇటు మీడియాకీ దూరంగా ఉన్న మున్నాభాయ్‌… గ‌డువులోగా త‌న ప‌నులు ముగించుకోవాల‌ని మ‌ళ్లీ దైనందిన ప‌నుల్లో ప‌డ్డాడు. వీలైనంత త్వరగా చేతిలో ఉన్న షూటింగ్‌ల‌ను పూర్తి చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. గురువారం ఉదయం ఆయ‌న ఇంటి ద‌గ్గర మీడియాతో మాట్లాడారు..`ఐ ల‌వ్ మై కంట్రీ..`, `ఐ ల‌వ్ ఇండియా..` అంటూ భావోద్వేగ భ‌రితంగా మాట్లాడారు. క‌న్నీళ్లు పెట్టుకొన్నారు. నోటి నుంచి.. మ‌రో మాట రాలేదు. క‌న్నీళ్లు తుడుచుకొంటూనే కారెక్కేశారు. కోర్టు గ‌డువుకు ముందే ఆయ‌న లొంగిపోవాల‌ని భావిస్తున్నారు. మున్నాభాయ్ కంట నీరు పెట్టుకోవ‌డం అక్కడ ఉన్నవారంద‌నినీ క‌ల‌చి వేసింది.

Exit mobile version