‘లియో’ నుండి సంజయ్ దత్ ఫస్ట్ లుక్ గ్లింప్స్.. గూస్‌బంప్స్ ఖాయం !


కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా, విక్రమ్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లియో’. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. అయితే తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈరోజు సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా, ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో సంజయ్ దత్ పోషిస్తున్న ఆంటోనీ దాస్ పాత్రకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఆంటోనీ దాస్ గా సంజయ్ దత్ పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. ఇక అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి గూస్ బంప్స్ ఖాయం. సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది.