Site icon TeluguMirchi.com

మహేష్ తో అర్జున్ రెడ్డి.. నిజమేనా ?

సినిమా రూల్స్‌ని బ్రేక్‌ చేసి కొత్త పాఠాలు నేర్పేది ఏదైనా ట్రెండ్‌ సెట్టరే. ఆ ప్రాతిపదికన అర్జున్ రెడ్డి సినిమా కూడా ఒక ట్రెండ్ సెట్టర్. 2017లో అర్జున్ రెడ్డి ఒక సెన్సేషన్. నిజంగా ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాకి కొత్తకోణంలో చూపించింది ‘అర్జున్‌రెడ్డి’. ఈ క్రెడిట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కు దక్కుతుంది.

తొలి సినిమాటోన్ ఇండస్ట్రీ దృష్టినంతా ఆకర్షించాడు ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలవడంతో తెలుగుతో పాటు, ఇతర పరిశ్రమల్లోనూ సందీప్‌ పేరు మార్మోగిపోయింది. ఆయన త్వరలోనే మహేష్‌బాబుతో ఓ చిత్రం చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత సందీప్‌ మరో సినిమాని ప్రకటించలేదు. మహేష్‌ని దృష్టిలో ఉంచుకొనే ఆయన ఓ కథని సిద్ధం చేసుకొన్నాడని, ఆ కథని కూడా ఇప్పటికే వినిపించాడని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో వాస్తవం ఏమిటో తెలియాల్సివుంది.

Exit mobile version