Site icon TeluguMirchi.com

కొత్త హీరోయిన్‌తో డేటింగ్‌ మొదలెట్టిన యంగ్‌హీరో

యంగ్‌హీరో సందీప్‌ కిషన్‌ సినిమాల కంటే ఎఫైర్ల గాసిప్‌లతోనే ఎక్కువగా మీడియాలోకి వప్తాడు. హీరోయిన్లతో కాస్త చనువుగా ఉండే ఈ హీరోపై ఎప్పుడు హీరోయిన్లతో ఎఫైర్‌ గురంచి హాట్‌ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈ యంగ్‌ హీరో డేటింగ్‌లో ఉన్నాడని చాలామంది హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇంటర్య్వూలో ఈ విషయమై స్పందిస్తే అబ్బే అలాంటిదేం లేదండి, అవన్నీ కేవలం ఊహించి రాస్తారు, మళ్లీ ఏం తెలియనట్టు అడుగుతారు అంటూ గాసిప్‌లను కొట్టి పారేస్తారు.

తాజాగా మరో ముద్దుగుమ్మతో సందీప్‌ కిషన్‌ లవ్‌లో ఉన్నట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి. ఇదివరకు పేర్లు వినిపించిన బామలు వేరు, ఈ కొత్త పిల్ల వేరు. కొత్త హీరోయిన్‌, సందీప్‌ల డేటింగ్‌ విషయం కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఇద్దరి మధ్య కాస్తో కూస్తో చనువు ఉంటేనే అది డేటింగ్‌ అనే పదంతో బయటకు పొక్కుతుంది. మరి ఈ కొత్త భామతో యంగ్‌ హీరో ప్రేమాయణం గురించి సందీప్‌ కిషన్‌ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. తెలుగు, తమిళ భాషల్లో హీరోగా పలు సినిమాలను చేస్తూనే నిర్మాతగా పలు చిత్రాలను ప్లాన్‌ చేస్తున్నాడు.

Exit mobile version