Site icon TeluguMirchi.com

సందీప్ ప్రేమించే అమ్మాయి ఎవరో..?

హిట్ . ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న హీరో సందీప్ కిషన్..వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హీరోగా సక్సెస్ అందుకున్న సందీప్..ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు కానీ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు. అయినాగానీ ఈయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు రావడం ఆయన అదృష్టమే అని చెప్పాలి. ప్రస్తుతం ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమాతో జులై 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఫై సందీప్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.

ఇక ఈ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న సందీప్ సినిమా విశేషాలతో పాటు తనపై వచ్చిన ప్రేమ విషయాల ఫై స్పందించాడు. గతంలో హీరోయిన్ రెజీనా తో ఎఫైర్ వార్తలు వచ్చాయి కదా అని అడిగితే అవన్నీ రూమర్లని.. రెజినా తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పాడు. అంతే కాదు. అసలు తను నిజంగా ప్రేమించిన అమ్మాయి పేరు మీడియాలో ఎప్పుడూ రాలేదని.. ఆ అమ్మాయి పేరు తప్ప మిగతా పేర్లన్నీ వచ్చాయని నవ్వేశాడు. కానీ ఆ ప్రేమించిన అమ్మాయి పేరును మాత్రం సందీప్ చెప్పలేదు. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని అంత మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

Exit mobile version