రొమాంటిక్ సీన్స్ కోసం తల్లితో గొడవ

sana khan hotబాలీవుడ్‌లో హాట్‌ హాట్‌గా అందాలు ఆరబోయం, కొన్ని సినిమాలలో అయితే శృంగార సన్నివేశాలు కూడా చాలా కామన్‌. ‘కత్తి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సనాఖాన్‌  ఆ తర్వాత మరో చిత్రంలో కనిపించలేదు. ఈ అమ్మడు బాలీవుడ్‌లో వచ్చిన అడపాదడపా అవకాశాలను వాడుకుంటూ బాగానే సంపాదిస్తోంది. హిందీలో ‘వజా తుమ్‌ హో’ చిత్రంలో ఈ అమ్మడు ఏది దాచుకోకుండా అన్నీ ఆరబోసింది. ఈ చిత్రంలో ముద్దులతో పాటు శృంగార సన్నివేశాలు కూడా ఉన్నాయి. దాంతో సనాఖాన్‌ తల్లి అందుకు ససేమిరా అన్నదట. ఇండియాలో ఏ తల్లి తన కూతురు కెమెరా ముందు బట్టలు విప్పడం సహిస్తుంది. అందుకే సనాఖాన్‌ తల్లి కూడా అలాంటి సీన్లలో నటించొద్దు అని వాదించిందట. అయినా కూడా ఈ అమ్మడు తల్లి ఎదురించి మరీ అలాంటి సన్నివేశాలలో నటించింది.

తాజాగా మీడియాతో ముచ్చటించిన సనాఖాన్‌ అప్పుడు తనకు ఎదురైన సంఘటనలు వివరించింది. శృంగార సన్నివేశాలు అవసరం లేకున్నా చిత్రీకరిస్తున్నాడు అంటూ తన తల్లి దర్శకుడితో గొడవ పడిరదట. ఆ సమయంలో సనాఖాన్‌ తన తల్లికి మొత్తం వివరించి, ఎదురించి చివరకు ఆ సీన్లలో నో చెప్పకుండా నటించిందట. తల్లిని ఎదురించి నటించడంతో తనకు కాస్త ఇబ్బంది కలిగిందని సనాఖాన్‌ చెప్పుకొచ్చింది. హాట్‌ హాట్‌గా నటించే ఈ అమ్మడికి ఇక బోల్డ్‌ గర్ల్‌గా బాలీవుడ్‌లో పేరు పడి యూత్‌ లో యమ క్రేజ్‌ వచ్చింది.