Site icon TeluguMirchi.com

సనా ఖాన్ మరో డర్టీ బొమ్మ

sana-khan-in-climaxవిద్యా బాలన్ ‘డర్టీపిక్చర్’ మరువక ముందే మరో డర్టీ బొమ్మ వచ్చేస్తుంది. సిల్క్ స్మిత జీవిత కథ ఆదరంగా రూపొందిస్తున్న ఈ చిత్రం లో కత్తి, మిస్టర్ నూకయ్య ఫేం సనా ఖాన్ సిల్క్ గా దర్శనమిస్తుంది. తెలుగు లో చేసిన ఈ రెండు సినిమాలు ఈ అమ్మడికి క్రేజ్ ను ఇవ్వలేక పోయాయి. ఈ మధ్యన ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6 లో మాత్రం కొంత ఫేం సంపాదించుకొంది. ఇప్పుడు ఆ ఊపుతోనే సిల్క్ గా రాబోతుంది. ‘క్లైమాక్స్’ గా టైటిల్ ఖారారు చేసిన ఈ చిత్రం ఇటీవల ఫోటో షూట్ ను జరుపుకుంది. విద్యా బాలన్ కన్నా నేనేమీ తక్కువ కాదు అన్నంత రేంజ్ లో అంగాంగ ప్రదర్శన చేసింది సనా. సిల్క్ జీవిత కథ తన కెరీర్ కు మంచి బ్రేక్ ఇస్తుందని సనా భావిస్తుంది. మరి ఈ చిత్రం సనాకు నిజంగానే బ్రేక్ ఇస్తుందో లేక కేరీర్ ను ‘క్లైమాక్స్’ కు చేరుస్తుందో తెలియాలంటే సిల్క్ బొమ్మ పడేదాక ఆగాల్సిందే.

Exit mobile version