Site icon TeluguMirchi.com

వేసవి లో ‘బర్నింగ్ స్టార్’ సెగలు…

Sampu-filmsబర్నింగ్ స్టార్ గా తెలుగు చిత్ర సీమా కు పరిచయం అయిన బాబు సంపూర్నేష్ బాబు. హృదయ కాలేయం చిత్రం తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తో అఖిలంద్ర ప్రేక్షేకుల అబిమానాన్ని పొందాడు. మొదటి హిట్ తో అనేక పెద్ద హీరోలతో కలిసి నటించే అవకాశం సంపూర్నేష్ బాబుకు వచ్చింది.

ప్రస్తుతం సంపూర్నేష్ బాబు రెండు చిత్రాలతో మనముందుకు వస్తున్నాడు. మంచు ఫ్యామిలి బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ లో మంచు విష్ణు నిర్మిస్తున్న సింగం 123 అనే సినిమాలో సంపూర్నేష్ బాబు పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడు. అలాగే స్టీవెన్ శంకర్ దర్శకత్వం లో కొబ్బరి మట్ట గా రాబోతున్నాడు. ఈ చిత్రం లో మొత్తం మూడు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు సంపు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఒక పాట విడుదలైంది. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నది. ఇలా ఈ రెండు చిత్రాలు కూడా ఈ వేసవి లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వేసవిలో మరింత వేడి పెంచేందుకు సంపూర్నేష్ బాబు రాబోతున్నాడు.

Exit mobile version