సింగర్ గా సంపూర్నేష్ బాబు..

Actor-Sampoornesh-Babuఒక్క సినిమా తో తెలుగు ఇండస్ట్రీ ని షేక్ చేసిన బాబు సంపూర్నేష్ బాబు. ‘హృదయ కాలేయం’ చిత్రంతో బర్నింగ్ స్టార్ గా మారిన ఈ నటుడు తాజాగా దర్శకుడు స్టీవెన్ శంకర్ అలియాస్ సాయి రాజేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘కొబ్బరిమట్ట’ చిత్రం లో నటిస్తున్నాడు. ఈయనలోని మరో అవతారం తో ఆడియన్స్ కు పరీక్షా పెట్టబోతున్నాడు. ఇంతకి అవతారం ఎంటింటే..ఇప్పటివరకు సంపూర్నేష్ బాబు లో ఓ నటుడు మాత్రమే ఉన్నాడని తెలుసు. తాజాగా ‘కొబ్బరిమట్ట’ చిత్రం తో తనలో ఓ గాయకుడు కూడా ఉన్నాడని నిరుపించుకోబోతున్నాడు. ఈ చిత్రం లో సంపు స్వయంగా ఓ పాటని పాడబోతున్నాడని టాక్.
.
ఈ చిత్రంలో సంపూ త్రిపాత్రాభినయం చేస్తుండడం మరో విశేషం. ఈ వారమే సంపూర్నేష్ బాబు స్వయంగా పాడిన ‘కొబ్బరిమట్ట’ సాంగ్ వీడియో & మేకింగ్ విడుదల చేయబోతున్నారు.‘హృదయ కాలేయం’ ఫస్ట్ టిసర్ తో యుట్యూబ్ తెలుగు రికార్డ్స్ బ్రేక్ చేసిన సంపు మరోసారి ఆ రికార్డ్స్ ని ‘కొబ్బరిమట్ట’ సాంగ్ తో బ్రేక్ చేయాలనీ చూస్తున్నాడు.