టాలీవుడ్ స్టార్ హీరోలు ఎక్కువ శాతం ఫేక్ కలెక్షన్స్‌ను ఫ్యాన్స్ ఒత్తిడి మేరకు చూపిస్తున్నారు అంటూ చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. వస్తున్నది రూపాయి అయితే రెండు రూపాయలు అంటూ చెప్పడం నిర్మాతలకు కూడా అలవాటు అయ్యింది. అదో పబ్లిసిటీ స్టంట్ అయ్యింది. అందుకే సినిమా వారు కలెక్షన్స్ ప్రకటిస్తుంటే ఏది నిజమో ఏది అబద్దమో తెలియడం లేదు. తాజాగా ఆ విషయమై కూడా సంపూర్నేష్‌బాబు తనదైన శైలిలో కౌంటర్ వేశాడు.
కొబ్బరిమట్ట అంటూ ఒక చిత్రాన్ని చేసి ఆ సినిమాలో అన్ని కౌంటర్స్ వేశాడు. ఎంతో మంది స్టార్ హీరోలకు, ఫ్యాన్స్‌కు ఆ కౌంటర్స్ తలిగి ఉంటాయి. ఇలాంటి సమయంలోనే కొబ్బరిమట్ట మొదటి 3 రోజుల్లో 12 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అంటూ ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. అది చూడగానే అబ్బో అంత మొత్తం వసూళ్లు చేసిందా అంటూ అంతా ఆశ్చర్య పోవడం ఖాయం. అయితే కింద చిన్న అక్షరాలతో ఫ్యాన్స్ డిమాండ్ మేరకు 9 కోట్లు యాడ్ చేసినట్లుగా కూడా చెప్పడం జరిగింది. ఇది సరదాగా చేసిన ప్రయత్నం. అయితే ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.