తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కొన్ని జిల్లాలు వరదలతో కొట్టుకు పోయే పరిస్థితి వచ్చింది. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. కొన్ని లక్షల మందికి తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంంటి సమయంలో ప్రతి ఒక్కరు వారికి అండగా నిలవాలంటూ పిలుపునిచ్చి తనవంతు సాయంగా కర్ణాటక ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నట్లుగా ప్రకటించాడు. సంపూను ఆదర్శంగా తీసుకుని స్టార్ హీరోలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలంటూ నెటిజన్స్ కోరుకుంటున్నారు.
ఉత్తర కర్ణాటక లో వరదలు నన్ను కలిచివేసింది. కన్నడప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా హృదయకాలేయం నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫోటోలు చూసి చాలా బాధవేసింది. నా వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిది కి ప్రకటిస్తున్నాను.#KarnatakaFloods pic.twitter.com/xqelI3sxWj
— Sampoornesh Babu (@sampoornesh) August 13, 2019