సంపూ మరోసారి సాయం

బర్నింగ్‌ స్టార్‌ సంపూర్నేష్‌బాబు తన సినిమాలతో ప్రేక్షకులను నవ్వించడంతో పాటు తన మంచి మనసుతో అందరి హృదయాలను కదిలిస్తున్నాడు. ఒక సామాన్యమైన మద్యతరగతి కుటుంబంకు చెందిన వ్యక్తి సంపూ. అనుకోని అవకాశంగా హీరో అయ్యాడు. నటుడిగా ఎంత సంపాధిస్తున్నాడో పెద్దగా తెలియదు. కాని ఆయన చేస్తున్న సాయాలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తనకు ఉన్నదాంట్లో కొద్దిలో కొద్దిగా సాయం చేసేందుకు ఎప్పటికప్పుడు ముందుకు వస్తున్నాడు. ఎలాంటి పకృతి విపత్తులు వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకు వచ్చి సాయం చేస్తున్నాడు.

తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కొన్ని జిల్లాలు వరదలతో కొట్టుకు పోయే పరిస్థితి వచ్చింది. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. కొన్ని లక్షల మందికి తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంంటి సమయంలో ప్రతి ఒక్కరు వారికి అండగా నిలవాలంటూ పిలుపునిచ్చి తనవంతు సాయంగా కర్ణాటక ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నట్లుగా ప్రకటించాడు. సంపూను ఆదర్శంగా తీసుకుని స్టార్‌ హీరోలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలంటూ నెటిజన్స్‌ కోరుకుంటున్నారు.