సమంత తో సంపూర్ణేష్ బాబు..?

Sampu-Vikram‘హృదయ కాళేయం’తో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేసి బర్నింగ్ స్టార్‌గా తెలుగు తెరకు పరిచయమైన హీరో సంపూర్ణేష్ బాబు. ఇతడు చేసింది ఒక్క సినిమా అయిన కానీ ఫ్యాన్ ఫలోవింగ్ మాత్రం పిక్ లేవలో సంపాదించుకున్నాడు.

తాజాగా ఈ బర్నింగ్ స్టార్‌కు మెగా ఆఫర్ వచ్చిందని ఫిలిం నగర్ సమాచారం. త్వరలో విక్రమ్ చేయబోతున్న ’10 ఎన్రాదుకుల్ల’ అనే చిత్రం లో సంపూర్ణేష్ కు అవకాశం వచ్చిందని టాక్.

విజయ్ మిల్టన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విక్రమ్ జోడిగా సమంత నటిస్తుంది. మురగదాస్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం సంపు సింగం 123 అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మంచు విష్ణు బ్యానర్ లో రాబోతుంది.