‘పంజా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయి విలన్‌గా మంచి మార్కులు కొట్టేసిన సంపత్ రాజ్ ఆ తర్వాత ‘దమ్ము’, ‘మిర్చి’ చిత్రాలతో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. పవర్ఫుల్ విన్ పాత్రలను పోషించి ఆ పాత్రలకు పక్కా న్యాయం చేసేలా కష్టపడుతూ ఉంటాడు. తాజాగా సంపత్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ విడాకుల తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేటి కాలంలో విడాకులు చాలా కామన్ అయిన వేళ సంపత్ రాజ్ వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈయనకు 23వ వయస్సులోనే 19ఏళ్ల అమ్మాయితో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగిందట.
చిన్న వయస్సు కాబట్టి అప్పుడు తెలియకున్నా కాస్త వయస్సు పెరిగాక ఇద్దరి దారులు వేరే కావడంతో విడాకులు తీసుకున్నారట. విడాకులు తీసుకున్నందుకు తనకు చాలా మంచి జరిగిందని ఈయన నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు. విడాకులు తీసుకోకుంటే తను నన్ను చంపడమో లేదా నేనే ఆమెను చంపడమో జరిగేది. కాని దేవుడి దయ వల్ల విడాకులు తీసుకుని ఇద్దరం వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటున్నాం. ఇప్పటికి అప్పుడప్పుడు వాళ్ల అమ్మ, తను కలుస్తూ ఉంటారు. నేను కూడా వారితో మాట్లాడుతూ, తనకు చేతనైనంతా సహాయం చేస్తూ ఉంటాను అంటూ సంపత్ రాజ్ తన విడాకుల గురించి చెప్పుకొచ్చాడు. కలిసి ఉంటే సుఖం లేనప్పుడు విడిపోయి హాయిగా ఉండొచ్చు అని సంపత్ రాజ్ చేసి చూపిస్తున్నాడన్నమాట!