TeluguMirchi Rating : 3/5
ప్రేమ, స్నేహం, బ్రేకప్ వంటి భావోద్వేగాలతో కూడిన కథలు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఈ కోవకు చెందిన ‘సమ్మేళనం’ వెబ్ సిరీస్ తాజాగా ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలై మంచి స్పందన పొందుతోంది. ఫిబ్రవరి 20న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సిరీస్, ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది.
ప్రియా వడ్లమాని, గణ ఆదిత్య, విజ్ఞయ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను తరుణ్ మహాదేవ్ తెరకెక్కించగా, సునయని.బి, సాకేత్.జె నిర్మాతలుగా వ్యవహరించారు. కొత్త నటులతో కూడిన ఈ కథను, దర్శకుడు హృద్యంగా మలిచారు. ముఖ్యంగా, ఓటీటీ ఫార్మాట్‌ను ఆసరాగా చేసుకుని అనవసరమైన అడల్ట్ కంటెంట్ లేదా బోల్డ్ హ్యూమర్ జోడించకుండా, క్లీన్ కామెడీతో సిరీస్‌ను రూపుదిద్దారు.
ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన ఈ సిరీస్, మూడో ఎపిసోడ్ నుంచి మరింత రసవత్తరంగా మారుతుంది. శ్రావణ్ జీ కుమార్ విజువల్స్, శరవణ వాసుదేవన్, యశ్వంత్ నాగ్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా శరవణ వాసుదేవన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సీన్లకు ప్రాణం పోసేలా ఉంటుంది.
ప్రస్తుతం ఈ సిరీస్ ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా వీక్షించబడుతున్న షోలలో ఒకటిగా నిలిచింది. మంచి కథనంతో, సున్నితమైన భావోద్వేగాలను హృద్యంగా మలిచిన ఈ సిరీస్, దర్శకుడు తరుణ్ మహాదేవ్‌కి టాలీవుడ్‌లో మంచి భవిష్యత్తును తీసుకువస్తుందనిపిస్తోంది.