Site icon TeluguMirchi.com

మనసులను హత్తుకునేలా ‘హాయ్ నాన్న’ ఫస్ట్ సింగిల్..!


నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’ మేకర్స్ నిన్న ఫస్ట్ సింగిల్ సమయమా ప్రోమోతో అలరించారు. ఈ రోజు, ఇష్టమైన వారందరికీ కోసం పాడుకునే పాటగా ఉండబోతున్న లిరికల్ వీడియోను విడుదల చేశారు. కాగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో వస్తోన్న ఈ సినిమాలో నాని జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తుంది.

ఇకపోతే ‘సమయమా..’ అంటూ సాగే ఈపాట మనసుని ఆకట్టుకునే మోడ్రన్ టచ్ వున్న బ్యూటీఫుల్ సాంగ్. ఆర్కెస్ట్రేషన్, బేస్ ట్రాక్ గిటార్ బీట్స్ ఎక్స్ టార్డినరిగా వున్నాయి. ట్యూన్, ప్రొగ్రషన్ కట్టిపడేస్తున్నాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. హేశం అబ్దుల్ వహబ్ సంగీతం అద్భుతంగా వుంది. నాని, మృణాల్ ఠాకూర్ అద్భుతమైన కెమిస్ట్రీతో విజువల్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

Hi Nanna: Samayama Lyrical Video Song | Nani,Mrunal Thakur | Shouryuv | Hesham Abdul Wahab

నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ‘హాయ్ నాన్న’ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version