సమంత మనోగతం

samantha’ఎం మాయచేసావే’ చిత్రంలో చీరకట్టుతో ముగ్దమనోహర రూపంతో తెలుగు ప్రేక్షకులపై మాయచేసిన సమంత రెండురోజుల క్రితం రిలీజైన “సీతమ్మ వాకిట్లో…” చిత్రంతో తన సక్సెస్ ను అమాంతం పెంచేసుకుంది. ఓ వార్తాపత్రికతో తన వ్యక్తిగత జీవితం గురించి ముచ్చటిస్తూ.. సమంత తన తండ్రి తెలుగువాడని, అమ్మ మళయాళీ అని అయితే తాను పుట్టిపెరిగింది మాత్రం చెన్నైలో అని చెప్పుకొచ్చింది. చెన్నైలోనే డిగ్రీ వరకు చదివిన సమంత సినిమా ఫీల్డ్ లోకి వస్తుందని ఎవరూ ఊహించలేదట.ఓసారి ఫ్రెండ్స్ తో కలిసి ఓ బర్త్ డే పార్టీ అటెండ్ అయినప్పుడు ఆ ఫోటో పేపర్ లో ప్రచురించారట. అది చూసిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ వెంకట్రామన్ సమంతాతో ఓ ఫోటో షూట్ చేసి తనకు ఓ టెక్స్ టైల్ షోరూంకి మోడలింగ్ చేసే అవకాశం ఇప్పించాడు. సమంతకి ఆసక్తిలేకపోయిన ప్యాకెట్ మనీ కోసం హాబిగా మొదలెట్టిన మాడలింగ్ దాదాపు సెంచరీ మార్క్ ని దాటేసింది.

సినిమాలో మొదటగా సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ అవకాశం ఇచ్చిన ముందు రిలీజ్ అయింది మాత్రం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏం మాయచేసావే’. తనకంటే అందమైన టాలెంట్ వున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నప్పటికినీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ సినిమాలు తనను వెతుకుంటూ రావడం తన అదృష్టమేనని, దానితోపాటు తన కృషి కూడా తన సక్సెస్ కు ప్రధాన కారణమని సమంత పేర్కొంది. తన నిర్ణయాలపై పూర్తి అధికారం తనదేనని తన తల్లిదండ్రులు ఇంతవరకు ఎప్పుడు తన కెరియర్ లో జోక్యం చేసుకోలేదని తనపై వారు అంతగా నమ్మకం చూపిస్తారని చెప్పింది సమంత. తాను ఓ మనిషినే అని తనకు ఓ లైఫ్ ఓ బాయ్ ఫ్రెండ్ ఉంటాడని, ఉన్నపుడు సిగ్గుపడకుండా చెబుతానని నవ్వుతూ చెప్పుకొచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ తెలుగువాడు కాదని, తమిళనాడుకు చెందిన వాడేనని ఇన్ డైరెక్ట్ గా క్లూస్ కూడా ఇచ్చింది సమంత. అయితే కనీసం మూడేళ్ళ దాక పెళ్ళి ప్రసక్తి ఉండదని, ఇకపై సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ చేయదలచుకోలేదని తేల్చి చెప్పింది.

ఇటీవల అనారోగ్యానికి గురై దాదాపు మూడు నెలలు కెమెరాకు దూరమైనప్పుడు తనలో పరిపక్వత వచ్చిందని, ఓ దశలో చావు అనే ఆలోచన కూడా రావడంతో ప్రపంచమంతా భిన్నంగా కనిపించడం మొదలెట్టిందట. ఆ సమయంలో శంకర్, మణిరత్నం సినిమాల్లో వచ్చిన అవకాశాలను కూడా దూరం చేసుకున్నానని, అప్పుడే జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తనకు తెలిసొచ్చిందని సమంత వివరించింది. అయితే దేవుడి దయవల్ల అంతా మంచే జరిగి ఈరోజు తాను ఈ స్థితిలో ఉన్నందుకు కృతజ్ఞతగా సమాజసేవ కోసం తన వల్ల వీలైనంత వరకు చేస్తున్నానని సమంత చెప్పుకొచ్చింది.