Site icon TeluguMirchi.com

సమంత ఆ రహస్యం చెప్పేసింది..

పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు సినిమాలు చేయడం తగ్గించడం , లేదా మానేయడం చేస్తారు. కానీ అక్కినేని కోడలు సమంత మాత్రం పెళ్లి తర్వాత సినిమాలు చేయడం బాగా పెంచేసింది. అంతే కాదు ఈఏడాది రంగస్థలం , మహానటి, అభిమన్యుడు వంటి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకొని మరోసారి తన సత్తాను చాటుకుంది. ప్రస్తుతం యు టర్న్ మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్భంగా పలు అంశాల్ని తెలిపి , అభిమానుల్లో , ప్రేక్షకుల్లో ఉన్న కొన్ని సందేహాలకు జవాబు ఇచ్చి వారిని బయటపడేసింది. చైతన్య.. తన చేతికి ఉండే ఒకేలాంటి ట్యాటూ అర్థం ఏమిటి? ఆ గుర్తుకు ఏదైనా లెక్క ఉందా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానం తెలిపింది. ఆన్ స్క్రీన్ లో తామిద్దరం ఆర్టిస్టులమని.. ఆఫ్ స్క్రీన్ లో వాస్తవంలో బతకాలన్నది తమ ఇద్దరి ఆలోచనగా ఆమె చెప్పారు.

చాలామంది స్టార్స్ అంటే అలా ఉంటారు.. ఇలా ఉంటారని చెబుతారని.. వాళ్లు ఫుల్ హ్యాపీగా ఉంటారు లేదంటే వాళ్లకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటూ ఊహించుకుంటూ ఉంటారు. కానీ.. ఒకరి జీవితం ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేరు. అందరూ మనుషులేనన్న విషయంతో పాటు.. తమ ఇద్దరి చేతుల మీద ఒకేలా ఉంటే ట్యాటూ గుట్టు ఏమిటంటే.. మేమిద్దరం అని.. వాస్తవంలో ఉందామని అంటూ అసలు రహాసాన్ని తెలిపింది.

Exit mobile version