టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా హైదరాబాద్‌లో ఒక డిజైనర్ వస్త్ర దుఖానం ప్రారంభించింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన డ్రస్ పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి. గ్రీన్ డైమండ్స్‌తో నెక్ నక్లెస్ మరియు చెవుల కమ్మలతో సమంత మరింత అందంగా కనిపించింది. డ్రస్‌పై ఉన్న పూలతో ఆమె అందంగా కనిపించడంతో పాటు సమంత అందంకు అంతా ఫిదా అవుతున్నారు. ఈ డ్రస్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఫొటోలకు లక్షల్లో లైక్స్ వస్తున్నాయి.
గత ఏడాది పలు చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న సమంత ఇటీవలే మజిలీ మరియు ఓబేబీ చిత్రాలతో కూడా సక్సెస్‌లను దక్కించుకుంది. అద్బుతమైన సక్సెస్ రేట్‌తో దూసుకు పోతున్న సమంత తెలుగులో కాస్త బ్రేక్ ఇచ్చింది. తమిళంలో మాత్రం ఈమె నటించేందుకు సిద్దం అవుతుంది. తెలుగులో కూడా త్వరలోనే నటిస్తానంటూ ఈమె చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గానే కాకుండా వెబ్ సిరీస్‌లో కూడా నటించిన సమంత పెళ్లి అయిన తర్వాత కూడా తన అందం మరింత పెంచుకుంటూ కనిపిస్తుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.