Site icon TeluguMirchi.com

సమంత ‘శాకుంతలం’ రిలీజ్ ట్రైలర్..!


సమంత, దేవ్ మోహన్ నటించిన పౌరాణిక ప్రణయ గాథ ‘శాకుంతలం’. శ్రీ వెంకటేశ్వ‌ర‌ క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న 3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది.ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్న ఈ సినిమాను మ‌రో మెట్టుకి తీసుకెళ్లేలా రిలీజ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

Shaakuntalam Release Trailer - Telugu | Samantha | Dev Mohan | Gunasekhar | April 14th Release

శ‌కుంత‌లంగా స‌మంత అందం, అమాయ‌క‌త్వం క‌ల‌గ‌లిపిన న‌ట‌న‌,దుష్యంత మ‌హారాజుగా దేవ్ మోహ‌న్ లుక్‌.. వారి మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు, భావోద్వేగ ప్ర‌యాణం ఎంత హృద్యంగా ఉంటుంద‌నేది ఈ ట్రైల‌ర్‌లో మ‌రోసారి చ‌క్క‌గా చూపించారు. అలాగే యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా వావ్ అనిపించేలా ఉన్నాయి. దుర్వాస మ‌హామునిగా మోహ‌న్ బాబు.. చిన్న‌నాటి భ‌ర‌తుడి పాత్ర‌లో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇలా ప్ర‌తీ అంశం ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేస్తుంది. అంతేకాదు ప్ర‌తి స‌న్నివేశాన్ని కుంచెతో బొమ్మ గీసిన‌ట్లు అద్భుతంగా తెర‌కెక్కించారు ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌.

Exit mobile version