‘ఓబేబీ’ పారితోషికం మూడుకు చేరిందట

సమంత ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. ఈ అమ్మడు తాజాగా ఓబేబీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్‌ను అందుకుంది. అంతకు ముందు మజిలీ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకుంది. రెండేళ్ల ముందు వరకు కోటి పారితోషికం దక్కించుకున్న సమంత తాజాగా కోటిన్నర నుండి రెండు కోట్ల వరకు పారితోషికం అందుకుంది. ఇప్పుడు ఓ బేబీ సక్సెస్‌తో సమంత ఏకంగా మూడు కోట్ల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక దర్శకుడు స్క్రిప్ట్‌తో సమంత వద్దకు వెళ్లగా ఆమె ఏకంగా మూడు కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసినట్లుగా తెలుస్తోంది. సమంత పారితోషికం విన్న ఆ దర్శకుడు వామ్మో అంటూ వెళ్లి పోయాడు. నిర్మాతలు ఆమె మూడు కోట్ల పారితోషికంను పెట్టేందుకు సిద్దంగా ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రానికి మూడు కోట్లు, రెగ్యులర్‌ కమర్షియల్‌ పాత్రకు రెండు కోట్ల వరకు ఈమె పారితోషికం డిమాండ్‌ చేస్తుంది.