అత్త మామతో కలిసి వేడుకలో పాల్గొన్న సమయంలో తెలుగింటి కోడలు ఎలాంటి డ్రస్ వేసుకోవాలో సమంత ఆమాత్రం ఆలోచించలేదా అంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే తన గురించి వచ్చే ఏ విమర్శలను పెద్దగా పట్టించుకోని సమంత ఎప్పటికప్పుడు ఇలాంటి కాస్ట్యూమ్స్‌తో కనిపిస్తూనే ఉంది. ఇక ఈమె వేసుకున్న డ్రస్ విషయానికి వస్తే దాని ధర రెండు లక్షల వరకు ఉంటుందట. ఫారిన్ ఇంపోర్టెడ్ అయిన ఆ డ్రస్‌ను ప్రత్యేకంగా ఆర్డర్ చేయించి తయారు చేయంచినట్లుగా చెబుతున్నారు. అంత చెత్త డ్రస్‌కు రెండు లక్షలు ఏంట్రా బాబోయ్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.