మొన్న నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా డెస్టినేషన్ వేడుకల్లో పాల్గొన్నారు. పెళ్లి మాత్రమే కాకుండా ఇలా బర్త్‌డే వేడుకలు కూడా డెస్టినేషన్ ఉంటాయని ఆశ్చర్యకరంగా తెలియజేశారు. ఆ పుట్టిన రోజు వేడుకల్లో సమంత వేసుకున్న డ్రస్ గురించి రకరకాలుగా మీడియాలో చర్చ జరిగింది. అసలు సమంత డ్రస్ వేసుకున్నట్లుగా లేదని పింక్ టవల్ ను చుట్టుకున్నట్లుగా ఉందంటూ విమర్శలు వచ్చాయి.
అత్త మామతో కలిసి వేడుకలో పాల్గొన్న సమయంలో తెలుగింటి కోడలు ఎలాంటి డ్రస్ వేసుకోవాలో సమంత ఆమాత్రం ఆలోచించలేదా అంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే తన గురించి వచ్చే ఏ విమర్శలను పెద్దగా పట్టించుకోని సమంత ఎప్పటికప్పుడు ఇలాంటి కాస్ట్యూమ్స్‌తో కనిపిస్తూనే ఉంది. ఇక ఈమె వేసుకున్న డ్రస్ విషయానికి వస్తే దాని ధర రెండు లక్షల వరకు ఉంటుందట. ఫారిన్ ఇంపోర్టెడ్ అయిన ఆ డ్రస్‌ను ప్రత్యేకంగా ఆర్డర్ చేయించి తయారు చేయంచినట్లుగా చెబుతున్నారు. అంత చెత్త డ్రస్‌కు రెండు లక్షలు ఏంట్రా బాబోయ్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.