గత వారం రోజులుగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత బ్యాడ్మింటన్ ఆట ఆడబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రపంచ ఛాంపియన్ తెలుగు తేజం బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బయోపిక్‌ను చేసేందుకు సమంత చాలా ఆసక్తిగా ఉందని, ఆమెకు బయోపిక్ ఛాన్స్ ఇచ్చేందుకు కూడా పీవీ సింధు ఓకే చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. కాని గత వారం రోజులుగా వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అని తేలిపోయింది. అసలు సమంత బ్యాడ్మింటన్ నేపథ్యంలో సినిమా చేసే ఆలోచన లేదని ఆమె సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.
మీడియాలో వస్తున్న వార్తలను పూర్తిగా కొట్టి పారేయడంతో పాటు ఇకపై కూడా సమంత అలాంటి సినిమాలో నటించదంటూ చెప్పుకొచ్చారు. బ్యాడ్మింటన్ సినిమా చేయాలంటే కొన్ని నెలల పాటు ఆ ఆటను నేర్చుకోవాల్సి ఉంటుంది. అంతుకు తగ్గట్లుగా బాడీని మార్చుకోవడంతో పాటు కండలు పెంచాలి. కాని సమంతకు అంత ఆసక్తి లేదు. పీవీ సింధు బయోపిక్‌ను ఇప్పటికే శ్రద్దా కపూర్ చేస్తుంది. మళ్లీ సమంత చేయాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాంటి ఆలోచన సమంతకు ఉండి ఉండదని, ఇదంతా మద్యవర్తులు పుట్టించిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.