అక్కినేని కోడలు సమంత సినిమాలతోనే కాదు సోషల్ మీడియా లోను నిత్యం యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. హాట్ హాట్ ఫోటో షూట్స్ , వీడియోస్ ఇలా ప్రతిదీ షేర్ చేస్తూ అలరిస్తుంటుంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఓ పిక్ వైరల్ గా మారడమే కాదు. ఆమెను విపరీతంగా ట్రోల్ చేసారు.
సమంత రీసెంట్ గా చాట్ లోకి వచ్చింది. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు, సమాధానాలు షేర్ చేసుకుంది. ఇక ట్రోలింగ్ విషయమై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. “ఒకప్పుడు ట్రోలింగ్ వల్ల నిద్ర లేని రాత్రులు గడిపాను.. కానీ ఇప్పుడు మాత్రం భలే నవ్వొస్తుంది. అయినా వారు ట్రోల్ చేస్తున్నారంటే మనం ఎంతో ఎత్తుకు ఎదిగామనిపిస్తుంది” అని సమంత చెప్పుకొచ్చింది.