దారుణం..చైతు- సామ్ ‘మ‌జిలి ‘ వీడియో లీక్ ..

లీకుల బెడద అన్ని సినిమా ఇండస్ట్రీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యం గా పెద్ద సినిమాల విషయం లో ఈ లీకులు ఎక్కువ అవుతున్నాయి. చిత్ర నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ లీకులను అడ్డుకోలేకపోతున్నారు. తాజాగా నాగ చైతన్య – సమంత జంటగా నటిస్తున్న మంజిలి చిత్రానికి సంబందించిన ఓ వీడియో లీకై , చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చింది. ఓ నెటిజన్ ఈ లీక్ వీడియోను సమంత కు షేర్ చేసాడు.

ఈ వీడియో చూశాక గొప్ప అనుభూతి క‌లుగుతుంది. చైతో మీరు ఏదైన సీక్రెట్ మాట్లాడుతున్నారా.. మ‌జిలి సినిమా విశేషాల కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నాం అని కామెంట్ పెట్టాడు. అయితే వీడియోని చూసిన స‌మంత షాక్ అయింది. చిత్రీక‌ర‌ణ‌కి సంబంధించిన మేకింగ్ వీడియో ఎలా రిలీజ్ అయిందంటూ ఆశ్చ‌ర్యాన్ని ఎమ్మోజీల‌ని ద్వారా తెలిపింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, కరణ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఏ మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాల త‌ర్వాత స‌మంత‌, నాగ చైత‌న్య క‌లిసి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.