పెళ్లి డేట్ పై క్లారిటీ ఇచ్చిన సమంత.

Sam-mrg-2018సక్సెస్ ఫుల్ హీరోయిన్ సమంత పెళ్లి విషయం పై క్లారిటీ ఇచ్చింది…గత నెల రోజులు గా సమంత ను నిద్ర పట్టకుండా చేస్తున్న పెళ్లి విషయం పై ఓ నిర్ణయం తీసుకొని హ్యాపీ గా ఉందట..’వచ్చే ఏడాది కూడా నేను సింగిల్ గానే ఉంటా.. పెళ్లీ గిళ్లీ జాన్తా నై’ అనేసింది సమంత. అంతే కాదు కొన్నిరోజులుగా ‘అసలు ఫోన్ ఎత్తాలన్నా కూడా చిరాకొచ్చేస్తోంది. తెలిసినోళ్లందరూ ‘ పెళ్లి పైనే ప్రశ్న వేస్తున్నారు. అందుకే పెళ్లి విషయంలో గట్టి నిర్ణయం తీసేసుకున్న తర్వాత.. ఈరోజు ఉదయం చాలా ఫ్రెష్ గా ఉండగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.

మొత్తానికి అభిమానులకు తీపి కబురు చెప్పి వారిని హ్యాపీ చేసింది..నిన్న మొన్నటివరకు సమంత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతోంది అనే వార్తలు తెర పడింది అని చెప్పవచ్చు..