ముద్దుగుమ్మ సమంత చేతి నిండా ప్రాజెక్ట్‌లు ఉన్నా కూడా పలు డ్రీమ్ ప్రాజెక్ట్‌లలో నటించాలని తెగ ఆరాటపడుతోంది. కన్నడలో మంచి విజయాన్ని సాధించిన ‘యూటర్న్’ చిత్రం రీమేక్‌లో సమంత నటించాలని భావించింది. విభిన్నమైన పాత్రలతో తనలోని నటనా పటిమను చూపించాలని సమంత చాలా ముచ్చట పడిరది. ఒకవైపు కమర్షియల్ చిత్రాలు చేతినిండా ఉన్నా కూడా తనకు సంతృప్తినిచ్చే పాత్రలలో నటించాలని సమంత తెగ ఆరాటపడిరది. ‘యూటర్న్’ సినిమా రీమేక్ హక్కులను కూడా సమంత కొనేసిందని, సమంత ఈ చిత్రంలో నటించనుందని గతంలో వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి.
కానీ తాజా సమాచారం ప్రకారం సమంత ‘యూ టర్న్’ చిత్రాన్ని ఎత్తేసినట్టే అని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం ఎక్కదు అని, ఇక్కడ సక్సెస్ కాదు అని సమంతకు సమాచారం అందిందట. అందుకే తెలిసి తెలిసి రిస్క్ చేయడం అవసరమా, అదో చెడ్డ పేరు అని, సమంత ఈ ప్రాజెక్ట్‌ను వదిలేసినట్టు తెలుస్తోంది. దాంతో దర్శకుడు ఈ చిత్రం కోసం ముద్దుగుమ్మ నిత్యా మీనన్‌ను ఎంపిక చేసినట్టు, హావ భావాలను చక్కగా కనబరిచే నిత్యా మీనన్ ఈ ప్రాజెక్ట్‌లో చేయనున్నట్టు సమాచారం అందుతోంది.