సమంతతో డర్టీ గేమ్ !


సమంత తన అభిమానులతో ఎప్పడూ టచ్ లోనే వుంటుంది. సోషల్ మీడియాలో తన అభిప్రాయలు, అప్డేట్స్ ఇస్తూ వుంటుంది. తాజాగా మరో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది సమంత. ప్రస్తుతం సమంత ‘సూపర్‌ డీలక్స్’ అనే తమిళ చిత్రంలో విజయ్‌కి జోడీగా నటిస్తుంది.

ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలోని టెన్సకి ప్రాంతంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లో వర్షంలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్స్‌లోని ఓ ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. రంగస్థలం కోసం మండుటెండలో చిత్రీకరణలో పాల్గొని..ఇప్పుడు టెన్సకిలో రాత్రిళ్లు వర్షంలో జరుగుతున్న చిత్రీకరణలో పాల్గొంటున్నాను. దేవుడా..నాతో ఎందుకు ఇలాంటి డర్టీ ఆటలు ఆడుతున్నావ్‌?’ అంటూ ఏడుస్తున్న ఇమోజీలను పెట్టింది. ఇప్పుడీ ఫొటో వైరల్ ఐయింది.