ఈ అమ్మడు తాజాగా సినీ జీవితంలోనే కాకుండా సాంఘికంగా కూడా నేను సైతం అంటూ ముందుకొచ్చి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ వారికి కొంచెం చేయూతనిస్తోంది. సమంత చేస్తున్న ఈ పనికి మంత్రి కేటీఆర్ నుండి సమంతకు పూర్తి మద్దతు ఉంది. అంతేకాకుండా అక్కినేని కుటుంబానికి కూడా కేటీఆర్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. నాగార్జున ఆస్తులన్నీ కూడా తెలంగాణలోనే ఉండడంతో నాగ్ కేటీర్‌తో సత్సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నాడు.
త్వరలో సమంత రాజకీయ అరంగేట్రం చేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే తెరాస ప్రభుత్వంతో మంచి సాన్నిహిత్యం సాగిస్తున్న సమంత త్వరలో తెరాసలోకి ప్రవేశించే సూచనలు ఉన్నాయి. నాగ్ ఆస్తులు కూడా హైద్రాబాద్‌లోనే ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడుకోవడానికి కూడా సమంత రాజకీయ ప్రవేశం ముఖ్యమే.
తెరాసలో నిలబడితే నాగ్ ఆస్తులకు, సమంత రాజకీయానికి కూడా బాగా కలిసొస్తుందని, అందుకే సమంత రాజకీయాల వైపు కూడా మొగ్గుచూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందాల ముద్దుగుమ్మ సమంత అవకాశాలు రాకపోతే రాజకీయాల్లో అయినా దూసుకుపోవాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి నుండే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది అని టాక్ వినిపిస్తోంది. చాలామంది హీరోయిన్లు కూడా రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవుల్లో భాద్యతలను చేపట్టారు.