‘మహానటి’ చిత్రంలో లీడ్ రోల్ కాకుండా ఒక ముఖ్య పాత్రలో నటించేందుకు సమంత ఎలా ఒప్పుకుంది అంటూ గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ సమయంలోనే అక్కినేని సన్నిహితుల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ పాత్రను నాగార్జున చెప్పడం వల్లే సమంత ఒప్పుకుందని, అక్కినేని కుటుంబంకు జమున చాలా సన్నిహితురాలు.
అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి జమున ఎన్నో చిత్రాల్లో చేసింది. అందుకే ఆమె పాత్ర అని చెప్పగానే నాగార్జున వెంటనే ఒప్పేసుకో అంటూ కాబోయే కోడలకు సూచించినట్లుగా తెలుస్తోంది. అందుకే సమంత సెకండ్ లీడ్ అయినా కూడా ఓకే చెప్పింది. ఇక సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించబోతున్న విషయం తెల్సిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.