అతిథిగా ‘అమ్మమ్మగారి ఇంట్లో’ సమంత!!

samanthaఅగ్రకథానాయిక సమంత త్వరలో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకోనుంది. వీరి వివాహానికి ఇరు కుటంబాలు పనులు కూడా అప్పుడే మొదలెట్టేశారు. పెళ్లి ముహుర్తం దగ్గర పడుతున్నా కూడా సమంతకు వచ్చే అవకాశాలు ఏ మాత్రం స్పీడు తగ్గలేదు. సమంత మాత్రం పెళ్లయ్యాక అటు భర్తను, ఇటు కెరియర్‌ను సమానంగా చూసుకోవాలని పాత్రల పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అతిథి పాత్రలు అయితే కెరియర్‌ పరంగా, వ్యక్తిగతంగా కూడా ప్లస్‌ అవుతాయని ఇటీవల అతిథి పాత్రకే ఎక్కువ మద్దతు ఇస్తోంది. సమంత ఇప్పటికే ‘రాజుగారి గది’, ‘మహానటి’ చిత్రాలో అతిథి పాత్రలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.

తాజాగా మరో చిత్రంలో కూడా అతిథిగా కనిపించడానికి ఒకే చెప్పినట్టు సమాచారం. నాగశౌర్య హీరోగా నటించనున్న ‘అమ్మమ్మగారి ఇంట్లో’ చిత్రంలో  ఓ కీలక పాత్రను పోషించడానికి అగ్రకథానాయికలను తీసుకోవాలని చిత్ర యూనిట్‌ ఆలోచన చేసిందట. అందుకు సమంతను సంప్రదించగా అతిథి పాత్రతో పాటు ఆ చిత్రానికి తన పాత్ర చాలా కీలకమట.

అందుకే రెండు విధాలుగా కలిసి వస్తుందని సమంత ‘అమ్మమ్మగారి ఇంట్లో’ చిత్రంలో నటించడానికి వెంటనే ఒకే చెప్పేసిందట. త్వరలో అక్కినేని వారి ఇంటికి కోడలిగా అడుగుపెట్టనున్న సమంతకు ఏమాత్రం విరామం ఉండకుండా వరుస అవకాశాలు వస్తూనే ఉండడంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు.