అందాల తార సమంత ప్రస్తుతం రామ్‌చరణ్ మరియు సుకుమార్ కాంభోలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తుంది. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ గోదావరి పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. ఈ చిత్రంలో చరణ్ చేపలు పట్టే చిట్టిబాబుగా నటిస్తున్నాడు. పల్లెటూరి షెడ్యూల్లో సమంత కూడా పాల్గోంటుంది. విపరీతంగా పెరిగిన ఎండను ముద్దుగుమ్మ సమంత ఏమాత్రం తట్టుకోలేకపోతుంది. భానుడి తీవ్రతను భరించలేకపోతుందట. ఎండ తీవ్రత బాగా పెరగడంతో సమంతకు వడదెబ్బ తగిలిందట.
ఎండలను భరించలేని ఈ అమ్మడు వెంటనే షూటింగ్‌కు బాయ్ చెప్పి హైద్రాబాద్ చెక్కేసింది. మే 2నుండి ప్రారంభం అయ్యే షూటింగ్లో పాల్గోంటానని చెప్పి ఈ అమ్మడు గోదావరి ప్రాంతం నుండి హైద్రాబాద్‌కు వచ్చేసింది. ఏప్రిల్‌లోని ఎండలనే తట్టుకోలేని ఈ అమ్మడు ఇక మే నెలలో వచ్చే భానుడి వేడిని తట్టుకోగలదా అనే అనుమానాలు వస్తున్నాయి. షూటింగ్‌కు ఇలా అంతరాయం కలిగితే ఈ సినిమాని ముందుగా అనుకున్న తేదీకి విడుదల చేయడం కష్టమే. భగభగమంటున్న ఈ ఎండలను సుతారమైన హీరోయిన్లు తట్టుకోవడం చాలా కష్టమే.