ముద్దుగుమ్మ సమంత అక్కినేని యువహీరో నాగచైతన్యతో గతకొంతకాలంగా ప్రేమలో ఉంటూ వస్తోంది. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఈ ఏడాది చివరికల్లా వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఇద్దరు కూడా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. నాగచైతన్య నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలయింది. కలర్ ఫుల్గా ఉన్న ఈ ట్రైలర్ చివరికి నాగచైతన్య చాలా సీరియస్గా అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అంటూ ఓ డైలాగ్ విసిరాడు. ప్రస్తుతం ఆ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వస్తోంది.
సమంత అభిమాని ఒకరు చూశారా… మీకు కాబోయే భర్త అమ్మాయిల గురించి ఎలా అంటున్నాడో… దీనిపై మీరు ఎలా స్పందిస్తారు, చైతూ మిమ్మల్ని ఉద్దేశించి కూడా అనొచ్చేమో అని అడిగాడట. దాంతో సమంత చైతూ అంత మాట అన్నది నా గురించి కాదులేండి అని చలాకీ సమాధానం చెప్పింది. నేనేంటో చైతూకి పూర్తిగా తెలుసు కాబట్టి నా గురించి అలా అనడు, నన్ను కాకుండా మిగతా అమ్మాయిలను ఉద్దేశించి అలా అన్నాడు అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది. ఎంతైనా నువ్వు గ్రేట్ సమంత, పెళ్లికి ముందే చైతూని పూర్తిగా అర్థం చేసుకున్నావ్, ఈ మాటలు పట్టించుకోకు అంటూ మరో అభిమాని కామెంట్ చేశారు.