Site icon TeluguMirchi.com

‘బాహుబలి 2’ సమంతకు సెగ చూపించింది

ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం రామ్‌చరణ్‌, సుకుమార్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మండుటెండలో షూటింగ్‌లో పాల్గోన్న ఈ అమ్మడు ఎండ వేడిని తట్టుకోలేక ప్యాకప్‌ చెప్పి హైద్రాబాద్‌కు వచ్చేసింది. సమ్మర్‌ కానుకగా వచ్చిన ‘బాహుబలి 2’ సినిమాని చూసి ఎండ తాపాన్ని తట్టుకోవాలని ఫిక్స్‌ అయ్యింది. అందుకే సమంత తన ప్రత్యూష షౌండేషన్‌తో పాటు ‘బాహుబలి 2’ని చూడడానికి వెళ్లింది. 400మంది పిల్లలతో సమంత హైద్రాబాద్‌ అమీర్‌పేట్‌లోని బిగ్‌ సినిమాస్‌ థియేటర్‌లో ‘బాహుబలి 2’ చూడడానికి వెళ్లింది. ఆ సమయంలో థియేటర్‌లో ఏసీలు పనిచేయడం లేదట.

ఏసీల మద్య తిరిగే సమంత కాసేపు కూడా ఏసీ లేనిదే ఉక్కిరిబిక్కిరి అయ్యిందట. ఫ్యాన్‌ల గాలి సమంతను సతమతం చేసిందట. దాంతో సమంత ఫస్ట్‌హాఫ్‌ కూడా పూర్తి కాకముందే ‘బాహుబలి 2’ చిత్రంను చూడకుండా బయటకు వచ్చేసింది. ఆ తర్వాత స్నేహితులతో కలిసి ‘బాహుబలి 2’ని వీక్షించి టీంను పొగిడింది. ముఖ్యంగా రాజమౌళిని తెగ ప్రశంసించింది. ఇకపోతే ‘బాహుబలి 2’ చిత్రాన్ని చూడడానికి వెళ్లిన సమంతకు ఈ చిత్రం వేసవి సెగ చూపించింది.

Exit mobile version