‘శాకుంతలం’ చూశాను.. ఒక గొప్ప ఇతిహాసం జీవం పోసుకుంది : సమంత


సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ ‘శాకుంతలం’. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇకపోతే మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి సమంత స్పందించారు.

“ఈ సినిమాను తాను చూశాననీ, అద్భుతంగా వచ్చిందని అన్నారు. ఒక గొప్ప ఇతిహాసం జీవం పోసుకుంది. గుణశేఖర్ నా హృదయానికి చాలా దగ్గరగా ఈ సినిమాను ఆవిష్కరించారు. పిల్లలంతా కూడా ఈ మ్యూజికల్ వరల్డ్ ను ప్రేమించడం ఖాయం.. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా పవర్ఫుల్ ఎమోషన్స్ ను ఆస్వాదిస్తారు. ఈ సినిమాకి సంబంధించి సాగిన జర్నీని ఎప్పటికీ మరిచిపోలేను.. అందుకు కారణమైన దిల్ రాజు, నీలిమ గుణ లకు థ్యాంక్స్ చెబుతున్నాను.. ఈ సినిమా ఎప్పటికి నాకు దగ్గరగానే ఉండిపోతుంది” అని సమంత చెప్పారు.

సమంత చేసిన వ్యాఖ్యలు సినిమా పై ఆసక్తి ను మరింత పెంచేశాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో దేవ్ మోహన్, డా.ఎం.మోహ‌న్ బాబు, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించ‌టం మరో విశేషం.