తన ట్విట్టర్ డబ్బాలో వేడి వేడి కబుర్లు పలహారంగా పెడుతుంటుంది సమంత. అయితే తన విషయాలే కాదు, తన సినిమాకి సంబంధించిన రహస్యాలన్నీ అందులో పోస్ట్ చేసేస్తుంటుంది. పవన్ సినిమా పేరు అత్తారింటికి దారి అవునా..? కాదా? అని తర్జనభర్జనలు పడుతున్న సమయంలో ఆ టైటిల్‌ని ట్విట్టర్ ద్వారా డిక్లేర్ చేసింది తనే! ఇప్పుడు మనంలో అఖిల్ ఉన్నాడని క్లూ కూడా ఇచ్చేసింది. ”నేనేదీ దాచుకోలేను. అందరితో పంచుకోవాలనిపిస్తుంది. అదే పెద్ద సమస్య అయిపోతోంది. నిజానికి అత్తారింటికి దారేది.. టైటిల్ ట్విట్ చేయానా?? అని టీమ్‌ని ముందే అడిగా. వాళ్లు ఓకే అన్నారు. ఆ తరవాతే పెట్టా. కానీ.. ట్విట్ చేసిన తరవాత.. అయ్యో.. అలా చేశావేంటి?? అని అడిగారు. ఇక నుంచి ఇలాంటి విషయాల్లో నన్ను నేను కంట్రోల్ చేసుకోవలసిందే” అని నొచ్చుకొంటోంది సమంత.