Site icon TeluguMirchi.com

‘సామజవరగమన’ గ్లింప్స్ విడుదల.. లవ్ మ్యారేజ్ కి కూడా ఇలాంటి ఒక ప్రాబ్లెమ్ ఉంటుందా ?


హీరో శ్రీవిష్ణు మొదటి నుంచి విభిన్నమైన జోనర్‌లతో అలరిస్తూవున్నారు. అయితే శ్రీవిష్ణు బిగ్గెస్ట్ స్ట్రెంత్ కామెడీ. చాలా కాలం తర్వాత వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘సామజవరగమన’ అనే హోల్సమ్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు శ్రీవిష్ణు. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడిగా రెబా మోనికా జాన్ నటిస్తోంది.

శ్రీవిష్ణుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, సామజవరగమన మేకర్స్ ఒక గ్లింప్స్ ని విడుదల చేశారు. వీడియో ఆహ్లాదకరమైన సంగీతంతో ప్రారంభమౌతుంది. తన గర్ల్ ఫ్రండ్ ని వివాహం చేసుకోవాలని సిద్ధపడిన శ్రీవిష్ణుకు లవ్‌లో కొత్త ప్రాబ్లం ఎదురౌతుంది. సామజవరగమన యూనిక్ కాన్సెప్ట్‌తో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని గ్లింప్స్ గ్యారెంటీ ఇస్తోంది. శ్రీవిష్ణు కామిక్ టైమింగ్ చాలా బాగుంది. చాలా మంది కమెడియన్స్ ఉండటం వల్ల సినిమాలో తగినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని భరోసా ఇస్తోంది. రామ్ అబ్బరాజు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చారు. రాంరెడ్డి కెమెరా పనితనం అద్భుతంగా వుంది. గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫన్ పార్ట్ ని ఎలివేట్ చేసింది.

భాను బోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన సంభాషణలు రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు నటించారు.

Sree Vishnu Birthday Glimpse | Samajavaragamana | Reba John | Ram Abbaraju | Gopi Sundar

Exit mobile version