Site icon TeluguMirchi.com

చరణ్ కు సల్మాన్ ఫిదా అయిపోయాడు

charan-yevaduరామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ఎవ‌డు. శ్రుతి హసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్. వంశీపైడి ప‌ల్లి ద‌ర్శక‌త్వం వహించారు. దిల్ రాజునిర్మాత‌. ప్రస్తుతం ఈ చిత్రంకు సంభందిచిన చివరి పాట చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎవడు సెట్ లో సందడి చేశారు. ‘ఫ్రీడం’ అనే లిరిక్ తో సాగే ఈ పాట ఆన్ లైన్ కట్ ను చూసి భలే సంబర పడిపోయారు. ఈ పాటలో చరణ్ చేసిన డాన్సులకు సల్మాన్ ఫిదా అయిపోయారు. చరణ్ డాన్సింగ్ స్టైల్ సల్మాన్ కి తెగ నచ్చేసిందట. అలాగే ఈ పాటకు కోరియోగ్రఫీ చేసిన జాని మాస్టర్ ని అభినందిచారు. నిన్నుబాలీవుడ్ కి తీసుకువెళతా జానీ అని మాట కుడా ఇచ్చేశారు. ఈ చిత్రంలో బన్ని ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, బన్ని కి జోడిగా కాజల్ నటిస్తోంది.

Exit mobile version