ప్రస్తుతం పరిస్థితిలో జో డర్ గయా సమ్ జో మర్గయా’ అనే సినిమా డైలాగులు పనికిరావని , భయపడే వాడే బ్రతుకుతాడని అన్నారు సల్మాన్‌ఖాన్ . ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను చూసి తాను ఎంతగానో భయపడుతున్నానని , కరోనావైరస్ విజృంభిస్తోన్న కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా వేరే నివాసంలో ఉంటున్న సల్మాన్ తన సోదరుడి కుమారుడు నిర్వాన్‌తో కలిసి ఓ ప్రత్యేక వీడియోను రూపొందించి అభిమానులతో పంచుకున్నారు.
” ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే నాకెంతో భయంగా ఉంది. మా నాన్నను చూసి మూడు వారాలు అయ్యింది. నిజం చెప్పాలంటే మేము చాలా భయపడుతున్నాం. మేము భయపడుతున్నామనే విషయాన్ని ధైర్యంగా చెబుతున్నాం. ఎవరైతే భయపడతారో నిజంగా వాళ్లు సురక్షితంగా ఉన్నట్లు” అని చెప్పుకొచ్చారు సల్మాన్.