స‌ల్మాన్‌తో సినిమా?

ramcharn salamn khanరామ్‌చ‌ర‌ణ్ – స‌ల్మాన్ ఖాన్ ఇద్దరూ మంచి స్నేహితులు. జంజీర్ స‌మ‌యంలో ఇద్దరికీ దోస్తీ బాగా కుదిరింది. చ‌ర‌ణ్ ముంబై షూటింగ్‌లో ఉన్నప్పుడు భోజ‌నం స‌ల్మాన్ ఇంటి నుంచే వచ్చేది. స‌ల్మాన్ హైద‌రాబాద్ వ‌స్తే మ‌కాం.. చ‌ర‌ణ్ ఇంట్లోనే. అలా ఇద్దరూ మంచి దోస్తులు అయిపోయారు. ఇప్పుడు క‌ల‌సి ఓ సినిమా చేయ‌బోతున్నారు. జంజీర్‌తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు చ‌ర‌ణ్‌. ఆ త‌ర‌వాత సినిమా కూడా దాదాపుగా ఖ‌రారైంది. అది స‌ల్మాన్ ఖాన్ బ్యాన‌ర్‌లో ఉంటుంద‌ని స‌మాచార‌మ్‌. స‌ల్మాన్ అడ‌గ్గానే, చ‌ర‌ణ్ కాద‌న‌కుండా ఈ ప్రాజెక్టు ఒప్పుకొన్నాడ‌ట. 2014 ప్రారంభంలోనే ఈ సినిమా ఉండొచ్చని ముంబై వ‌ర్గాలు చెబుతున్నాయి.