Saindhav : సంక్రాంతి బరిలో ‘సైంధవ్’.. పోటీ మాములుగా లేదుగా ?

విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం ‘సైంధవ్’. హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని ముందుగా క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 22న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు మేకర్స్. అదేరోజు ప్రభాస్ స‌లార్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుండ‌టంతో సైంధ‌వ్ ను పోస్టుపోన్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

‘సైంధవ్’ మూవీని జనవరి 13 న విడుదల చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. పోస్టర్‌లో వెంకటేష్, బేబీ సారాతో కనిపించారు. ఇక లాంగ్ హాలీడేస్ సినిమాకి అడ్వాంటేజ్ కానున్నాయి. పాపులర్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిక్, రుహాని శర్మ, ఆండ్రియా జెరేమియా, సారా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.

ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో మ‌హేశ్ బాబు ‘గుంటూరు కారం’, ర‌వితేజ ‘ఈగ‌ల్’, తేజా సజ్జా ‘హ‌నుమాన్‌’ డేట్స్ ఫిక్స్ చేసుకోగా.. నాగార్జున ‘నా సామిరంగ’, రజినీకాంత్ ‘లాల్ సలామ్’, విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు కూడా వున్నాయి. ఇప్పుడు తాజాగా వెంకటేష్ ‘సైంధవ్’ కూడా ఈ రేసులో నిలిచింది. దీంతో ఈ సంక్రాంతికి పోటీ ఓరేంజ్ లో ఉండబోతుంది. మరి ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.