అల్లుడుకి రిలీజ్ కష్టాలు !

కేరళలో వరదలు వల్ల ఎంతో ప్రాణ, ఆర్థిక నష్టం జరిగింది. అక్కడ వరదలు భీభత్సం సృష్టించడం ఏమో కానీ మారుతీ టీమ్ ని మాత్రం టెన్షన్ తో ముచ్చెమటలు పోయిస్తోంది. ఎందుకంటే శైలాజారెడ్డి అల్లుడుగా నాగ చైతన్య ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఇప్పడు ఆ సినిమా ఆ తేదీన రావడం లేదు అని నాగ చైతన్య చెప్పడం జరిగింది. పోనీ ఒక్క వారం ఆలస్యంగా వద్దామంటే ఇప్పటికిప్పుడు వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ జోడించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నట్టు వార్త వినిపిస్తుంది.

ఇది గనుక నిజమే అయితే దానికి ఎంత లేదన్నా మూడు నాలుగు రోజులైనా కావాలి. ప్రస్తుతం వెన్నెల కిషోర్ అమెరికాలో రవితేజ నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ లో ఉన్నాడు. వెన్నెల కిషోర్ ఈ నెల 28న హైదరాబాద్ వస్తున్నాడు. తను వచ్చిన తరువాత ఎవరికి కాల్ షీట్ ఇచ్చాడో ఇంకా తెలియాల్సి ఉంది. అన్ని కుదిరి తనతో తీసినా ఆ సీన్స్ తాలూకు డబ్బింగ్ రీ రికార్డింగ్ అన్ని పూర్తి చేస్తే కానీ సెన్సార్ కు వెళ్లే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ నెల 31న కాకుండా సెప్టెంబర్ 7న విడుదల చేయాలనీ అనుకుంటుంది చిత్ర యూనిట్.

కానీ అక్కడే అసలు చిక్కు వచ్చింది. సెప్టెంబర్ 7న సునీల్ అల్లరి నరేష్ ల సిల్లీ ఫెలోస్, సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే, రానా నిర్మించిన కేరాఫ్ కంచరపాలెం, మను-శరత్ మరార్ ప్రేమకు రైన్ చెక్ అనే సినిమాలు విడుదల కానున్నాయి.సెప్టెంబర్ 7న వీటితో పాటు అల్లుడు వస్తే థియేటర్ల విషయంలో కొంత రాజీ పడాల్సి ఉంటుంది. పోనీ సెప్టెంబర్ 13న వచ్చేద్దాం అనుకుంటే సమంతా యు టర్న్ అదే తేదీకి అధికారికంగా ప్రకటించింది. ఈ చిక్కులు ఎందుకు మూడు వారం గాని, నాలుగో వారం గాని చూసుకుందాం అంటే సెప్టెంబర్ 27న నాగార్జున నానిల మల్టీ స్టారర్ దేవదాస్ లాస్ట్ వీక్ కోసం రెడీ అవుతోంది. సెప్టెంబర్ 20 అయితే అల్లుడుకి కొంత బెటర్.